ఏబీ డివిలియర్స్ కు సర్జరీ! | Sakshi
Sakshi News home page

ఏబీ డివిలియర్స్ కు సర్జరీ!

Published Thu, Sep 29 2016 12:38 PM

ఏబీ డివిలియర్స్ కు సర్జరీ!

కేప్ టౌన్: గత కొంతకాలంగా మోచేతి గాయంతో బాధపడుతున్న దక్షిణాఫ్రికా క్రికెట్ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ వచ్చే వారం సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమయ్యాడు. అతని మోచేతి నొప్పి తరచు వేధిస్తుండటంతో మోచేతి నొప్పి పూర్తిగా తగ్గక పోవడంతో సర్జరీ అవసరమవుతున్నట్లు దక్షిణాఫ్రికా జట్టు మేనేజర్ మొహ్మద్ మూసాజీ స్పష్టం చేశాడు. వచ్చే వారం ఆదిలో  ఏబీ మోచేతి ఆపరేషన్ జరుగనున్నట్లు మూసాజీ తెలిపాడు. ఈ నేపథ్యంలో అతను సర్జరీ తరువాత ఎనిమిది నుంచి పది వారాల పాటు జట్టుకు అందుబాటులో ఉండే ఆస్కారం లేదన్నాడు. దీనిలో భాగంగానే ఆస్ట్రేలియాతో జరిగే వన్డే, టెస్టు సిరీస్ ల నుంచి అతనికి విశ్రాంతినివ్వనున్నట్లు తెలిపాడు.

'ఆస్ట్రేలియాతో సిరీస్ లో భాగంగా ఏబీ ఫిట్ నెస్ టెస్టును పరీక్షించాం. అందులో ఏబీ విఫలమయ్యాడు. అతని చేతికి కట్టు లేకుండా 80శాతం మెరుగ్గా ఫీలవుతున్నాడు. అయితే అతనొక పూర్తిస్థాయిలో కోలుకోవడానికి సర్జరీ అవసరం. పూర్వపు ఫామ్ ను అందిపుచ్చుకోవాలనేది అతని కొరిక. దానిలో భాగంగా చికిత్సకు సిద్ధమయ్యాడు' అని మూసాజీ పేర్కొన్నాడు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement