'అందుకు డివిలియర్సే తగిన వ్యక్తి' | AB de Villiers is Capable Captain, Want to Focus on my Game, says Hashim Amla | Sakshi
Sakshi News home page

'అందుకు డివిలియర్సే తగిన వ్యక్తి'

Jan 7 2016 5:51 PM | Updated on Sep 3 2017 3:16 PM

'అందుకు డివిలియర్సే తగిన వ్యక్తి'

'అందుకు డివిలియర్సే తగిన వ్యక్తి'

దక్షిణాఫ్రికా టెస్టు జట్టును నడిపించడానికి ఏబీ డివిలియర్సే తగిన వ్యక్తి అని ఆ ఫార్మెట్ నాయకత్వ పగ్గాలకు తాజాగా వీడ్కోలు చెప్పిన హషీమ్ ఆమ్లా అభిప్రాయపడ్డాడు.

కేప్టౌన్: దక్షిణాఫ్రికా టెస్టు జట్టును నడిపించడానికి ఏబీ డివిలియర్సే తగిన వ్యక్తి అని ఆ ఫార్మెట్ నాయకత్వ పగ్గాలకు తాజాగా వీడ్కోలు చెప్పిన హషీమ్ ఆమ్లా అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో తనతో పాటు చాలా మంది క్రికెటర్లకు టెస్టు జట్టును నడిపించే సామర్థ్యం ఉన్నా..అందుకు   అన్ని అర్హతలున్న వ్యక్తి డివిలియర్సేనని ఆమ్లా స్పష్టం చేశాడు. ఇప్పటికే వన్డే పగ్గాలు మోస్తున్న డివిలియర్స్ ప్రతిభ ఏమిటో అందరికీ తెలిసిందేనని ఆమ్లా తెలిపాడు. తన సహచరుడైన ఏబీ చాలా తెలివైన కెప్టెన్ అని ఈ సందర్బంగా కొనియాడాడు. ప్రస్తుతం తన దృష్టంతా ఆటపైనే కేంద్రీకరించినట్లు ఆమ్లా పేర్కొన్నాడు.
 

ఇంగ్లండ్ తో స్వదేశంలో జరిగిన రెండో టెస్టు డ్రా ముగిసిన అనంతరం టెస్టు క్రికెట్ కెప్టెన్సీకి ఆమ్లా గుడ్ బై చెప్పాడు. ఏడాదిన్నర క్రితం దక్షిణాఫ్రికా టెస్టు పగ్గాలు చేపట్టిన ఆమ్లా సారథ్యంలో 14 మ్యాచ్ లు జరగ్గా, అందులో నాలుగు టెస్టుల్లో విజయం, మరో నాల్గింటిలో ఓటమి ఉన్నాయి. మిగతా ఆరు మాత్రం డ్రా ముగిశాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement