ముగిసిన వింటర్ ఒలింపిక్స్ | 2014 Sochi Winter Olympic Games closing ceremony | Sakshi
Sakshi News home page

ముగిసిన వింటర్ ఒలింపిక్స్

Feb 24 2014 1:27 AM | Updated on Sep 2 2017 4:01 AM

ముగిసిన వింటర్ ఒలింపిక్స్

ముగిసిన వింటర్ ఒలింపిక్స్

చరిత్రలో అతి ఖరీదైన వింటర్ ఒలింపిక్స్ ఆదివారం ముగిశాయి. పదిహేడు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో ఆతిథ్య రష్యా అత్యధికంగా 13 స్వర్ణాలతోపాటు మొత్తం 33 పతకాలు గెలుచుకొని అగ్రస్థానంలో నిలిచింది.

సోచి: చరిత్రలో అతి ఖరీదైన వింటర్ ఒలింపిక్స్ ఆదివారం ముగిశాయి.  పదిహేడు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో ఆతిథ్య రష్యా అత్యధికంగా 13 స్వర్ణాలతోపాటు మొత్తం 33 పతకాలు గెలుచుకొని అగ్రస్థానంలో నిలిచింది. 11 స్వర్ణాలతో నార్వే, 10 స్వర్ణాలతో కెనడా వరుసగా ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. భారత్ తరపున ముగ్గురు అథ్లెట్లు పాల్గొన్నా ఒక్క పతకమూ నెగ్గని సంగతి తెలిసిందే. 2018 వింటర్ ఒలింపిక్స్‌కు దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌చాంగ్ నగరం ఆతిథ్యమిస్తుంది.
 
 త్రివర్ణ రెపరెపలు: భారత్‌పై ఐఓసీ నిషేధం ఎత్తివేయడంతో వింటర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత అథ్లెట్లు త్రివర్ణ పతాకంతో పాల్గొన్నారు. ప్రారంభోత్సవంలో భారత అథ్లెట్లు ఐఓసీ పతాకంతో పాల్గొన్న సంగతి తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement