ప్రజాసంకల్పయాత్ర@1600 కిలోమీట‌ర్లు | Sakshi
Sakshi News home page

ప్రజాసంకల్పయాత్ర@1600 కిలోమీట‌ర్లు

Published Tue, Mar 27 2018 11:35 AM

YS Jagan Mohan Reddy prajasankalpayatra Crosses 1600 km Mark - Sakshi

సాక్షి, గుంటూరు: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. గుంటూరు జిల్లా పలుదేవర్లపాడులో మంగళవారం పాదయాత్ర 1600 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ అక్కడ రావి మొక్కను నాటారు. అనంతరం గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించారు.

అంతకుముందు 121వ రోజు సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల శివారు నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగించారు. ఆయన వెంట నడించేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారందరితో కలిసి జననేత ముందుకు సాగుతున్నారు.

వైఎస్‌ జగన్‌ 2017 నవంబర్‌ 6న  వైఎస్‌ఆర్‌  జిల్లా ఇడుపుల‌పాయ‌లో ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించిన విషయం విదితమే.180 రోజుల పాటు 125 నియోజకవర్గాల్లో 3వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. ఇప్ప‌టి వ‌ర‌కు వైఎస్ఆర్ జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో పాద‌యాత్ర పూర్తికాగా ఈ నెల 12న ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలోని ప్ర‌వేశించింది.  
 

ప్రజాసంకల్పయాత్ర సాగుతుందిలా...

0 - వైఎస్‌ఆర్‌ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ (నవంబరు 6, 2017)

100 - క‌ర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి సమీపం (నవంబరు 14, 2017)

200 - కర్నూలు జిల్లా, డోన్‌ నియోజకవర్గం ముద్దవరం (నవంబరు 22, 2017)

300 - కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచి (నవంబరు 29, 2017)

400 - అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లి (డిసెంబర్‌ 7,2017)

500 - అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు (డిసెంబరు 16, 2017)

600 - అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం కటారుపల్లి క్రాస్‌ రోడ్స్‌ (డిసెంబరు ‌24, 2017)

700 - చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం చింతపర్తి శివారు (జనవరి 2, 2018)

800 - చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నల్లవెంగనపల్లి (జనవరి 11, 2018)

900 - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి హరిజనవాడ (జనవరి 21, 2018)

1000 - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో పైలాన్‌ ఆవిష్కరణ (జనవరి 29, 2018)

1100 - నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం, కొరిమెర్ల (ఫిబ్రవరి 7, 2018)

1200 - ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, రామ‌కృష్ణాపురం (ఫిబ్రవరి 16, 2018)

1300 - ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల (ఫిబ్రవరి 25, 2018)

1400​‍ - ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం  నాగులపాడు (మార్చి 5, 2018)

1500- గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ములుకుదూరు(మార్చి 14, 2018)

1600- గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలుదేవర్లపాడు (మార్చి 27, 2018)

Advertisement
 
Advertisement
 
Advertisement