ఎట్టకేలకు టీజేఎస్‌ తొలి జాబితా | Telangana Elections 2018 TJS Release First List Of 4 Candidates | Sakshi
Sakshi News home page

Nov 17 2018 6:28 PM | Updated on Jul 29 2019 2:51 PM

Telangana Elections 2018 TJS Release First List Of 4 Candidates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) తెలంగాణా అసెంబ్లీకి పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. పీపుల్స్‌ ఫ్రంట్‌ కూటమిలో భాగంగా టీజేఎస్‌ నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాలో నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండో జాబితాను ఆదివారం ప్రకటిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొపెసర్‌ కోదండారాం తెలిపారు. అయితే కోదండరాం పోటీ చేసే అంశంపై పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 

ఎందరో నేతలతో భేటీల అనంతరం
శుక్రవారం అర్ధరాత్రి వరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్‌ కుంతియాతో కోదండరాం భేటీ అయిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం పార్టీ కోర్‌ కమిటీతో చర్చించిన అనంతరం నలుగురుతో కూడిని తొలి జాబితాను విడుదల చేశారు.  

టీజేఎస్‌ తొలి జాబితా ఇదే..
మల్కాజిగిరి : దిలీప్‌ కుమార్‌ కపిలవాయి
మెదక్‌: జనార్ధన్‌ రెడ్డి
దుబ్బాక: చిందం రాజ్‌ కుమార్‌
సిద్దిపేట: భవాని రెడ్డి 
 

Advertisement
 
Advertisement
Advertisement