ఎమ్మెల్యే పార్టీ: అమ్మాయిలతో పచ్చనేతల చిందులు! | TDP Leaders record Dances At New Year Celebrations | Sakshi
Sakshi News home page

Jan 1 2019 6:53 PM | Updated on Jan 1 2019 7:29 PM

TDP Leaders record Dances At New Year Celebrations - Sakshi

సాక్షి, కనిగిరి: అసలే కొత్త సంవత్సరం.. కళ్ల ముందు అందమైన అమ్మాయిలు.. ఇంకేముంది అదో అధికారిక కార్యక్రమం అన్న విషయం కూడా మర్చిపోయారు తెలుగు తమ్ముళ్లు. స్టేజిపైన అమ్మాయిలతో చిందులేస్తూ తమను తాము మైమరిచిపోయారు పచ్చ నేతలు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఆర్‌ అండ్‌ బీ గెస్ట్ హౌజ్‌లో జరిగింది. కొత్త సంవత్సరం సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబురావు గెస్ట్‌హౌజ్‌లో పార్టీని ఏర్పాటు చేశారు. స్పెషట్‌ అట్రాక్షన్‌ కోసం ఓ రికార్డింగ్ డాన్స్‌ ట్రూప్‌ను కూడా రప్పించారు. ఇంకేముంది తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే ఎదురుగానే.. అమ్మాయిలతో కలిసి చిందులేయడం ప్రారంభించారు. టీడీపీ నేతలు భేరి పుల్లారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చిన్న మస్తాన్‌ కూడా అమ్మాయిలతో చిందులేసిన వారిలో ఉన్నారు. బాధ్యతగల నేతలై ఉండి.. కనీస పద్ధతి పాటించకుండా వ్యవహరించిన టీడీపీ నేతల వైఖరిపై అక్కడికి వచ్చినవారంతా ముక్కున వేలేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement