కాంగ్రెస్‌ గెలుపు కోసం కృషి చేస్తాం: నేరెళ్ల శారద | Nerella saradha on congress party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ గెలుపు కోసం కృషి చేస్తాం: నేరెళ్ల శారద

Oct 23 2018 2:04 AM | Updated on Mar 18 2019 9:02 PM

Nerella saradha on congress party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం రాష్ట్రం లోని మహిళలందరం కృషిచేస్తామని రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద అన్నారు. కేబినెట్‌లోకి కనీసం ఒక్క మహిళను కూడా తీసుకోకుండా అగౌరవపర్చిన కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సోమవారం గాంధీభవన్‌లో జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాళ్లు, రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లు, పట్టణ అధ్యక్షుల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో మహిళా కాం గ్రెస్‌ నిర్వహించాల్సిన పాత్రపై చర్చించి కార్యాచరణ రూపొందించారు. మహాకూటమి అభ్యర్థుల గెలుపు కోసం మహిళా కాంగ్రెస్‌ నేతలంతా కృషి చేయాలని ఆమె సూచించారు. సమావేశంలో ఆలిండియా మహిళా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జెన్నెట్‌ డిసౌజా, రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ ఇన్‌చార్జి చమన్‌ ఫర్జానా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement