అశ్లీల నృత్యాలు; ఆ హోటల్‌ టీడీపీ ఎమ్మెల్యేదే..! | Mujra Party Fallout, TDP Leader Kolluru Ramakrishna Arrested | Sakshi
Sakshi News home page

ముజ్రా పార్టీ హోటల్‌ టీడీపీ ఎమ్మెల్యేదే..!

Jul 19 2018 5:04 PM | Updated on Aug 10 2018 8:42 PM

Mujra Party Fallout, TDP Leader Kolluru Ramakrishna Arrested - Sakshi

సాక్షి, విజయవాడ: అధికార పార్టీకి చెందిన కొల్లూరు రామకృష్ణను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. విజయవాడలోని 47 డివిజన్‌కు అధ్యక్షుడిగా ఉన్న రామకృష్ణకు ముజ్రా పార్టీ నిర్వహణలో ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. భవానీపురంలో గల ఆలీవ్‌ ట్రీ హోటల్‌లో మహిళలతో అసభ్య నృత్యాలు (ముజ్రా పార్టీ) నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాడి చేసిన సంగతి తెలిసిందే. టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే బినామీ ఈ హోటల్‌ నిర్వహిస్తున్నాడని సమాచారం.

పక్కా సమాచారంతో హోటల్‌పై దాడి చేసి ముజ్రా పార్టీలో పాల్గొన్న 53 మందిని అరెస్ట్ చేశామని జాయింట్ సీపీ రానా తెలిపారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ. 5 వేల నుంచి 10 వేల చొప్పున రూ. 5 లక్షల వరకు నిర్వాహకులు ఈ పార్టీ కోసం వసూలు చేశారని వెల్లడించారు. పోలీసుల దాడిలో దొరికిన ఐదుగురు అమ్మాయిలను వాసవ్య మహిళా మండలి సంరక్షణలో పెట్టామని చెప్పారు. ఇకపై నగరంలో ఇలాంటి పార్టీలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, పట్టుబడిన వారిలో పలువురు ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది. నూతన కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు చార్జి తీసుకున్న రోజునే ముజ్రా పార్టీ బాగోతం బయటపడడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement