కేసీఆర్‌ ప్రచారాన్ని తిప్పికొట్టండి: ఎల్‌.రమణ | L ramana comments over kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ప్రచారాన్ని తిప్పికొట్టండి: ఎల్‌.రమణ

Published Mon, Oct 8 2018 1:23 AM | Last Updated on Mon, Oct 8 2018 1:23 AM

L ramana comments over kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీడీపీపై చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టా లని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ పిలుపునిచ్చారు. చంద్రబాబుని ఉద్దేశించి తెలం గాణ ప్రజల్లో సెంటిమెంట్‌ను రాజేసేలా ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎక్కడికక్కడ ఖండించాలని పార్టీ నేతలను కోరారు. ఆదివారం హైదరా బాద్‌లోని తన నివాసంలో టీడీపీ ముఖ్య నేత లు, అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్టీ అధికార ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమిని ఎందుకు ఏర్పాటు చేస్తున్నామో, కాం గ్రెస్‌తో ఎందుకు కలుస్తున్నామో కింది స్థాయి కేడర్‌కు, ప్రజలకు తెలపాలని సూచించారు. కూటమి నేతృత్వంలో రూపొందిస్తున్న కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ) విషయంలో పార్టీ అనుసరించాల్సిన వైఖరి, ప్రతిపాదించాల్సిన ముఖ్య అంశాలపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో పార్టీ నేతలు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, అరవింద్‌ కుమార్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement