రామనగర స్థానానికి కుమార రాజీనామా? | Sakshi
Sakshi News home page

రామనగర స్థానానికి కుమార రాజీనామా?

Published Sun, May 20 2018 7:09 AM

Kumaraswamy resign to Ramanagaram place - Sakshi

సాక్షి,బెంగళూరు: విధానసభ ఎన్నికల్లో రామనగర, చెన్నపట్టణ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించిన జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి చెన్నపట్టణ నియోజకవర్గ ఎమ్మేల్యేగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు  రామనగర  నియోజకవర్గానికి రాజీనామా చేయనున్నారు.శనివారం విధానసౌధలో ఎమ్మేల్యేగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో చెన్నపట్టణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా రామనగర నియోజకవర్గ  స్థానానికి రాజీనామా చేయనున్నట్లు సంకేతాలిచ్చారు. దీంతో రామనగర నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి.

Advertisement
Advertisement