టీజేఎస్‌కు ఇచ్చే సీట్లపై కాంగ్రెస్‌ గ్రీన్‌సిగ్నల్‌! | Congress Party Offers 11 seats to TJS | Sakshi
Sakshi News home page

Nov 6 2018 4:32 PM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Party Offers 11 seats to TJS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహాకూటమిలో సీట్ల పంపకాలపై ఇప్పటికీ పీటముడి వీడటం లేదు. ఇటు టీడీపీకి, అటు తెలంగాణ జనసమితి(టీజేఎస్‌)కు ఇచ్చే స్థానాలపై కూటమి పెద్ద కాంగ్రెస్‌ ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో టీజేఎస్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసమితికి 11 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సీట్లలో కొన్నిచోట్ల స్నేహపూర్వక పోటీ ఉంటుందని కాంగ్రెస్‌ మెలిక పెట్టినట్టు సమాచారం. స్నేహపూర్వక పోటీపై జనసమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్‌ ఇచ్చే సీట్లలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీట్లు కేటాయించాల్సి ఉండటంతో అటూ టీజేఎస్‌లోనూ సీట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సమావేశమైన జనసమితి కోర్‌కమిటీ.. మంగళవారంలోపే సీట్ల కేటాయింపుపై తుది ప్రకటన చేయాలని డిమాండ్‌చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement