కోడెలా... నీ రాజకీయ జీవితమే ఫ్యాక్షన్‌

Ambati Rambabu Fires On Kodela Siva Prasada Rao - Sakshi

నీ ఇంట్లో బాంబులు పేలి ఎంతమంది చనిపోయారో అందరికీ తెలుసు   

నీ పిల్లల్ని హెచ్చరిస్తేనే సత్తెనపల్లి, నరసరావుపేట ప్రశాంతత 

భవిష్యత్తులో నీ రాజకీయ జీవితం భూస్థాపితం 

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

సత్తెనపల్లి: కోడెల శివప్రసాదరావు రాజకీయ జీవితమంతా ఫ్యాక్షన్‌ మనస్తత్వమేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన ఇంట్లో బాంబులు పేలి ఎంతమంది చని పోయారో, ప్రజలందరికీ తెలుసునని, ఎవరు ఫ్యాక్షనిస్టో ఆయన రాజకీయ జీవితమే చెబు తుందన్నారు. తనపై స్పీకర్‌ కోడెల చేసిన వ్యాఖ్యలకు అంబటి ఘాటుగా సమాధాన మిచ్చారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. శాంతిభద్రతలు కాపాడుతున్నానని ఆయన చెప్పే మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని, చరిత్ర ఒకసారి వెనక్కు చూసుకుంటే ఎవరేమి టో తెలుస్తుందన్నారు. కులాలు, వర్గాలు, ముఠాలను రెచ్చగొడుతూ కొట్లాటలను ప్రోత్స హించే మనస్తత్వం కలిగిన వ్యక్తి అని దుయ్య బట్టారు. నాలుగున్నర ఏళ్ల క్రితం మీ పిల్లల్ని హెచ్చరించి ఉంటే కొంతైనా సత్తెనపల్లి, నర సరావుపేట నియోజకవర్గాల ప్రజలు ప్రశాం తంగా జీవించి ఉండేవారన్నారు. త్వరలో ఆయన రాజకీయ జీవితం భూస్థాపితం అవ డం ఖాయమన్నారు. లంచాలు తీసుకోలేదని, అవినీతి చేయలేదని త్రికోటేశ్వరస్వామి సాక్షిగా కోడెల ప్రమాణం చేస్తే ఆయనను విమర్శిం చనని అంబటి అన్నారు. నాలుగున్నరేళ్లలో రెండు నియోజకవర్గాల్లో నీవు, నీ కుటుంబం చేసిన అవినీతిపై వంద ప్రశ్నలు సిద్ధం చేశానని, వాటికి సమాధానం చెప్పగలవా అని కోడెలకు సవాల్‌ చేశారు. మొదట ఈ పది ప్రశ్నలకు సమాధానం చెప్పి నిజాయతీని నిరూపించుకోవాలన్నారు. 

కోడెలకు అంబటి సంధించిన ప్రశ్నలు
- సత్తెనపల్లి రఘురామ్‌నగర్‌లో దేవుని మాన్యానికి చెందిన భూములను చట్టానికి వ్యతిరేకంగా ఆక్రమించుకుని రూ.కోట్ల విలువైన భవనం నిర్మించింది ఎవరు? మీ సొంత డబ్బులతోనా? లేక కాంట్రాక్టర్‌ దరువూరు నాగేశ్వరరావు డబ్బుతోనా? 
సత్తెనపల్లి–పిడుగురాళ్ళ రహదారి పక్కన ఉన్న గొడుగుల సుబ్బారావు అనే రైతు స్వాధీనంలో ఉన్న 18 ఎకరాల భూమిని అధికారులు, పోలీసు బలగాల సహకారం తో ఆక్రమించుకుని మీ బినామీకి చెందిన శశి ఇన్‌ఫ్రా పేరుతో రిజిష్టరు చేయించు కున్నది వాస్తవం కాదా? 
నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైను కాంట్రాక్ట ర్లను బెదిరించి రూ.కోట్లు  డిమాండ్‌ చేసిన మాట వాస్తవం కాదా? అతను లొంగకపోవ డంతో వారికి చెందిన వర్క్‌షెడ్‌లను, కార్లను ధ్వంసం చేసిన మాట వాస్తవం కా దా? దానిపై కేంద్ర మంత్రి, సీఎం వద్ద పంచాయతీ జరిగిన మాట వాస్తవం కాదా?  
రాష్ట్ర వ్యాప్తంగా పశు సంవర్థక శాఖ పశు వుల మేత కోసం సైలేజ్‌ గడ్డి(పాతర గడ్డి)ని రైతులకు అందజేసే క్రమంలో నీకుమార్తె విజయలక్ష్మి బినామీ పేర్లతో రూ.40 కోట్లు కాజేసిన మాట వాస్తవం కాదా? 
- గుంటూరు నాజ్‌సెంటర్‌లో రూ.200 కోట్ల తో మాల్‌ నిర్మించడం, దానికి ఇసుక, సిమెంట్, ఐరన్, ఇటుక, చిప్స్‌ అన్నీ సత్తెనç పల్లికి చెందిన కాంట్రాక్టర్ల నుంచి సరఫరా చేయించుకోవడం మాట వాస్తవం కాదా?  
- సత్తెనపల్లి– నరసరావుపేట మధ్యలో ఉన్న మీ కుటుంబానికి చెందిన సేఫ్‌ కంపెనీకి చెందిన మందులను జిల్లాలోని అన్ని మెడికల్‌ షాపుల్లో విక్రయించాలని లక్ష్యాలు విధించి బెదిరించిన మాట వాస్తవం కాదా? మందులను అమ్మని మెడికల్‌ షాపులపై డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లను పంపించి కేసులు పెట్టిం చి వేధించిన మాట వాస్తవం కాదా? 
నరసరావుపేటలో ఆర్టీసీ స్థలం లీజుకు తీసుకుని మీరు కడుతున్న మాల్‌కు రోడ్డుపై వెళుతున్న ఇసుక లారీలను పోలీసులతో బెదిరించి ఇసుకను ఉచితంగా పోయించు కుంటున్న మాట వాస్తవం కాదా?
మీ సేఫ్‌ కంపెనీకి చెందిన ఉద్యోగుల భోజనం కోసం సత్తెనపల్లి, నరసరావుపేట అన్న క్యాంటీన్‌ల నుంచి రోజుకు 150 భోజనాలు తీసుకెళ్లి ఒక్కొక్క భోజనానికి రూ.30 చొప్పున కార్మికుల నుంచి వసూలు చేసిన మాట వాస్తవం కాదా? 
 మీ కుమారుడికి చెందిన హీరోహోండా షోరూమ్‌ నుంచి వాహనాలు అమ్మేందుకు యానిమేటర్లకు లక్ష్యాలు విధించి మరీ  వేధించిన మాట వాస్తవం కాదా?  
సత్తెనపల్లి, నరసరావుపేట నియోజక వర్గాల్లో ఉన్న అధికారులపై లక్ష్యాలు విధించి ప్రతి శాఖ నుంచి ప్రతి నెలకు ఇంత మామూళ్లు ఇవ్వాల్సిందేనని అధికారులను ఇబ్బంది పెట్టి మామూళ్లు వసూలు చేస్తున్న మాట నిజం కాదా?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top