గ్రహం అనుగ్రహం, శనివారం 7, ఫిబ్రవరి 2015 | Graham Anugraham | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, శనివారం 7, ఫిబ్రవరి 2015

Feb 7 2015 3:29 AM | Updated on Aug 21 2018 12:03 PM

శ్రీ జయనామ సంవత్సరం

 శ్రీ జయనామ సంవత్సరం
 ఉత్తరాయణం, శిశిర ఋతువు
 మాఘ మాసం
 తిథి బ.తదియ ఉ.10.03 వరకు
 తదుపరి చవితి
 నక్షత్రం ఉత్తర పూర్తి
 వర్జ్యం ప.11.40 నుంచి 1.26 వరకు
 దుర్ముహూర్తం ఉ.6.34 నుంచి 8.05 వరకు
 అమృతఘడియలు రా.10.16 నుంచి 12.03 వరకు
 సూర్యోదయం :    6.34
 సూర్యాస్తమయం:     5.54
 రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
 యమగండం:
 ప.1.30 నుంచి
 3.00 వరకు
భవిష్యం
 
మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
 
వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు పనిభారం.

మిథునం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమ తప్పదు. ఆరోగ్యభంగ ం. పనుల్లో స్వల్ప ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
 
కర్కాటకం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు  పదోన్నతులు.
 
సింహం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్ర మాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు.
 
కన్య:
బంధువులతో సఖ్యత. విందువినోదాలు. కార్యజయం. విద్య, ఉద్యోగావకాశాలు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. సన్మానాలు.
 
తుల: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
 
వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. యత్నకార్యసిద్ధి.  ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం. ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషక రమైన సమాచారం.
 
ధనుస్సు: నూతన ఉద్యోగయోగం. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
 
మకరం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
 
కుంభం: పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ధనవ్యయం.
 
మీనం: మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
 
- సింహంభట్ల సుబ్బారావు
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement