గ్రహం అనుగ్రహం, గురువారం 5, ఫిబ్రవరి 2015 | Graham Anugraham | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, గురువారం 5, ఫిబ్రవరి 2015

Feb 5 2015 3:12 AM | Updated on Aug 21 2018 12:03 PM

శ్రీ జయనామ సంవత్సరం

శ్రీ జయనామ సంవత్సరం
 ఉత్తరాయణం, శిశిర ఋతువు
 మాఘ మాసం
 తిథి బ.విదియ పూర్తి
 నక్షత్రం మఖ రా.1.04 వరకు
 వర్జ్యం ప.11.46 నుంచి 1.33 వరకు
 దుర్ముహూర్తం ఉ.10.20 నుంచి 11.05 వరకు
 తదుపరి ప.2.50 నుంచి 3.36 వరకు
 అమృతఘడియలు రా.10.25 నుంచి 12.11 వరకు
 సూర్యోదయం:    6.35 సూర్యాస్తమయం:     5.53
 రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
 యమగండం:
 ఉ.6.00 నుంచి
 7.30 వరకు

భవిష్యం
 
మేషం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు.
 
వృషభం: బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.
 
మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.
 
కర్కాటకం: శ్రమ పెరుగుతుంది. బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.
 
సింహం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
 
కన్య: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.
 
తుల: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీసేవలకు గుర్తింపు రాగలదు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
 
వృశ్చికం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో  పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి.
 
ధనుస్సు: దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
 
మకరం: ప్రయాణాలలో మార్పులు. ధనవ్యయం. కుటుంబ సమస్యలు. మిత్రులతో విభేదాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు చికాకులు.
 
కుంభం: ఆసక్తికరమైన సమాచారం  అందుతుంది. ఆస్తిలాభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగయోగం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.
 
మీనం: పనులలో విజయం. శుభవార్తలు వింటారు. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.

- సింహంభట్ల సుబ్బారావు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement