న్యూజెర్సీలో వైఎస్సార్‌సీపీ విజయోత్సవం | Ysrcp victory celebrations held in New Jersey | Sakshi
Sakshi News home page

న్యూజెర్సీలో వైఎస్సార్‌సీపీ విజయోత్సవం

Jun 10 2019 4:46 PM | Updated on Jun 10 2019 4:53 PM

Ysrcp victory celebrations held in New Jersey - Sakshi

న్యూజెర్సీ : అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్‌ ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ విజయోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అభిమానులు, వైఎస్సార్‌ కుటుంబ శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో రాయల్‌ ఆల్బర్టస్‌ ప్యాలెస్‌లో జరిగిన వేడుకల్లో దాదాపు 700 మందికి పైగా ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గెలుపు నీతికి, నిజాయితీకి నిబద్ధతకు నిలువుటద్దంగా డా. ప్రభాకర్‌ రెడ్డి అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని మరో మూడు దశాబ్ధాలపాటూ వైఎస్‌ జగన్‌ పాలించాలని అభిమానులు కోరుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement