‘విద్యార్థులకు కౌన్సెలింగ్ కేంద్రాలు పెట్టండి’ | UGC orders to start counciling centers in KVs and highier educational institutions | Sakshi
Sakshi News home page

‘విద్యార్థులకు కౌన్సెలింగ్ కేంద్రాలు పెట్టండి’

May 11 2015 3:01 AM | Updated on Sep 3 2017 1:48 AM

‘విద్యార్థులకు కౌన్సెలింగ్ కేంద్రాలు పెట్టండి’

‘విద్యార్థులకు కౌన్సెలింగ్ కేంద్రాలు పెట్టండి’

విద్యార్థులు ఒత్తిడి, ఆందోళన, ఇంటిపై బెంగ (హోం సిక్‌నెస్) తదితర మానసిక సమస్యలను అధిగమించేందుకు కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలను యూజీసీ ఆదేశించింది.

న్యూఢిల్లీ: విద్యార్థులు ఒత్తిడి, ఆందోళన, ఇంటిపై బెంగ (హోం సిక్‌నెస్) తదితర మానసిక సమస్యలను అధిగమించేందుకు కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలను యూజీసీ ఆదేశించింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.

విద్యాసంస్థల్లో ప్రతీ టీచర్ కనీసం 25 మంది విద్యార్థుల బాగోగులను చూస్తూ, వారికి విద్యాపరంగా, మానసికంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని పేర్కొంది. విద్యార్థుల పురోగతి, పరీక్షల ఫలితాలు, హాజరు తదితర విషయాలను వారి తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు తెలపాలని స్పష్టంచేసింది.

Advertisement
 
Advertisement
Advertisement