ఎస్‌ఎం కృష్ణ బీజేపీలో చేరతారు | SM Krishna will join BJP | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎం కృష్ణ బీజేపీలో చేరతారు

Feb 5 2017 1:13 AM | Updated on Mar 29 2019 9:31 PM

ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ బీజేపీలో చేరడం ఖాయమని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప తెలిపారు.

యడ్యూరప్ప వెల్లడి
సాక్షి, బెంగళూరు (కలబుర్గి): ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ బీజేపీలో చేరడం ఖాయమని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప తెలిపారు. కలబుర్గిలో శనివారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. కాగా, కృష్ణకు బీజేపీలో ఉన్నత స్థానాన్ని కల్పించనున్నట్లు అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత జగదీశ్‌ శెట్టర్‌ తెలిపారు.

తెలివైన నాయకులు ఎవరూ కాంగ్రెస్‌లో ఉండబోరని ఎంఎస్‌కృష్ణ అంశాన్ని ఉద్దేశించి కేంద్రమంత్రి వెంకయ్య బెంగళూరులో వ్యాఖ్యానించారు. ఇటీవల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేకమంది నేతలు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల్లో చేరారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement