సిగరెట్‌కు రూ.2 ఇవ్వలేక పొడిచి పరార్‌ | Man stabs cigarette vendor over Rs 2 | Sakshi
Sakshi News home page

రెండు రూపాయిల సిగరెట్‌ లొల్లి ఎంతపనిచేసింది!

Jul 25 2017 10:59 AM | Updated on Aug 29 2018 8:38 PM

సిగరెట్‌కు రూ.2 ఇవ్వలేక పొడిచి పరార్‌ - Sakshi

సిగరెట్‌కు రూ.2 ఇవ్వలేక పొడిచి పరార్‌

ప్రశాంతంగ ఉన్న ఆ ప్రాంతాన్ని ఓ వ్యక్తి ఒక్కసారిగా భీతావాహంగా మార్చాడు. చుట్టుపక్కల జనాలు వణికిపోయేలా చేశాడు.

లూథియానా: ప్రశాంతంగ ఉన్న ఆ ప్రాంతాన్ని ఓ వ్యక్తి ఒక్కసారిగా భీతావాహంగా మార్చాడు. చుట్టుపక్కల జనాలు వణికిపోయేలా చేశాడు. సిగరెట్‌ కొనుక్కునేందుకు వచ్చి తీసుకొని రూ.2 చెల్లించలేక షాపు ఓనర్‌ను కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లూథియానాలోని శరబా నగర్‌ ప్రాంతంలోని సునీల్‌ కుమార్‌ అనే వ్యక్తి పాన్‌ షాప్‌ నడుపుతున్నాడు.

అతడికి సహాయం చేసేందుకు సునీల్‌ బావమరిది రోహిత్‌ కుమార్‌ కూడా షాపు వద్దకు వచ్చి పనిలో నిమగ్నమయ్యాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్‌ కావాలని తీసుకున్నాడు. అనంతరం పది రూపాయలు ఇచ్చాడు. అయితే, మరో రెండు రూపాయలు వస్తాయని రోహిత్‌ అడగ్గా ఇచ్చేందుకు నిరాకరించాడు. ఈ క్రమంలో మాటలు పెరిగి సిగరెట్‌ తీసుకున్న వ్యక్తి అనూహ్యంగా కత్తితో రోహిత్‌ను పొడిచి పరారయ్యాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. దాడికి పాల్పడిన వ్యక్తికోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement