ఆలోచన ఉంటే..! | Maharashtra bride takes a toilet as wedding gift! | Sakshi
Sakshi News home page

ఆలోచన ఉంటే..!

May 17 2015 1:00 AM | Updated on Aug 28 2018 5:25 PM

ఆలోచన ఉంటే..! - Sakshi

ఆలోచన ఉంటే..!

‘ఆలోచన ఉంటే.. మరుగుదొడ్డి వస్తుంది.

ముంబై: ‘ఆలోచన ఉంటే.. మరుగుదొడ్డి వస్తుంది..’ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓ ప్రకటనలో ఇటీవల టీవీల్లో ఎక్కువగా వినిపిస్తున్న డైలాగ్ ఇది! అయితే ఈ అమ్మాయికి ఆలోచనే కాదు.. అడిగే సత్తా కూడా ఉంది. అత్తింటి వారింట్లో మరుగుదొడ్డి లేదన్న సంగతి తెలుసుకొని పెళ్లి సమయంలోనే అడిగేసింది. ఇంట్లో మరుగుదొడ్డి ఉండాల్సిందేనని స్పష్టంగా చెప్పడంతో అత్తింటివారు, పుట్టింటివారు చకచకా ఆ ఏర్పాటు చేశారు.

పెళ్లి సమయంలో ఇచ్చే నగలు, ఆభరణాలు, కట్నకానుకలతోపాటు ఓ తాత్కాలిక ‘టాయిలెట్’ను కూడా పెట్టారు. మహారాష్ట్రలోని అలోకా జిల్లా అన్దురా గ్రామానికి చెందిన చైతలీ గలాఖే అనే అమ్మాయికి  దేవేంద్ర మకోడే అనే అబ్బాయితో ఇటీవల పెళ్లి జరిగింది. పెళ్లి కుదిరిన తర్వాత.. అత్తారింట్లో మరుగుదొడ్డి లేదన్న సంగతి చైతలీకి తెలిసింది.

దీంతో ఆమె మరుగుదొడ్డి కావాల్సిందేనని ధైర్యంగా అడిగింది. దీంతో పుట్టింటివారు, మెట్టింటివారు కలసి అన్ని వసతులున్న ఓ టాయిలెట్ (ప్రిఫ్యాబ్రికేటెడ్)ను కట్నకానుకలతో కలిపి ఇచ్చారు. కానుకల్లో ఉన్న ఈ టాయిలెట్‌ను చూసి ఆశ్చర్యపోవడం పెళ్లికి వచ్చిన వారి వంతైంది! ‘‘పెళ్లిలో సాధారణంగా ఇచ్చే వస్తువులన్నింటి కన్నా నిజానికి టాయిలెటే ముఖ్యం. అందుకే అది ఉండాల్సిందేనని అడిగా. మా నాన్న, మామగారు కలసి దాన్ని కొనిచ్చారు’’ అని చైతలీ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement