హైకోర్టు జడ్జికి బెదిరింపులు | High Court Judge says he received threating call | Sakshi
Sakshi News home page

హైకోర్టు జడ్జికి బెదిరింపులు

Jun 18 2014 1:15 PM | Updated on Oct 8 2018 3:56 PM

మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్కు ఓ అగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు.

చెన్నై: సామాన్యులు మొదలు సాక్షాత్తూ హైకోర్టు న్యాయమూర్తులకు సైతం బెదిరింపులు వస్తున్నాయి. మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్కు ఓ అగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు.

ఈ సంఘటనకు సంబంధించి జస్టిస్ కర్ణన్.. రిజిస్ట్రార్ జనరల్, అడిషనల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్కు సమన్లు జారీ చేశారు. సోమవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో తనకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్టు కోర్టులో వెల్లడించారు. న్యాయమూర్తి సూచనల మేరకు సంబంధిత నిందితుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా రిజిస్ట్రార్ జనరల్ పోలీసులను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement