జైలుకి గాడిదలు, అవి చేసిన తప్పేమి? | Donkeys Jailed For 4 Days In Uttar Pradesh. | Sakshi
Sakshi News home page

జైలుకి గాడిదలు, అవి చేసిన తప్పేమి?

Nov 28 2017 9:56 AM | Updated on Nov 29 2017 7:56 AM

Donkeys Jailed For 4 Days In Uttar Pradesh.  - Sakshi

లక్నో : సాధారణంగా జైళ్లకి తప్పు చేసిన వ్యక్తులు వెళ్తుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని జలన్ జిల్లా ఉరై జైలులో ఓ విడూరం జరిగింది. గాడిదలు తప్పు చేశాయంటూ, ఆ జంతువులను జైలులో పెట్టారు అధికారులు. ఇంతకీ ఆ ఎనిమిది గాడిదలు చేసిన పెద్ద తప్పేమిటో తెలుసా? జైలు కాంపౌండ్‌లో ఉన్న ఖరీదైన మొక్కల్ని నాశనం చేయడమే. వీటి విలువ లక్షల్లో ఉంటుందని జైలు అధికారులు చెబుతున్నారు. తమ సీనియర్‌ అధికారి జైలుకి లోపల ఏర్పాటుచేసిన ఖరీదైన మొక్కలను ఈ గాడిదలు నాశనం చేశాయంటూ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆర్‌కే మిశ్రా చెప్పారు.

గాడిదలను వదులుకోవాల్సి వస్తుందంటూ పలు మార్లు ఓనర్‌ను హెచ్చరించినప్పటికీ ఫలితం లేకపోయిందని, దీంతో వీటిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ గాడిదలను జైలు నుంచి బయటికి విడిపించడానికి ఓ స్థానిక రాజకీయ నాయకుడు బెయిల్‌ మొత్తాన్ని చెల్లించాడు. బెయిల్‌కు కావాల్సిన నగదు కట్టడంతో జైలు అధికారులు ఆ గాడిదలకు విముక్తి కల్పించారు. తమ గాడిదలు జైలు నుంచి విడుదలవుతున్నాయని ఇక్కడికి వచ్చానని, నాలుగు రోజుల పాటు తమ ఎనిమిది గాడిదలు జైలులోనే ఉన్నట్టు వాటి యజమాని కామ్‌లేష్‌ తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement