మరింత మెరుగైన దిలీప్ కుమార్ ఆరోగ్యం | Dilip Kumar likely to be discharged in two days Mumbai | Sakshi
Sakshi News home page

మరింత మెరుగైన దిలీప్ కుమార్ ఆరోగ్యం

Sep 24 2013 7:27 PM | Updated on Sep 1 2017 11:00 PM

గుండె సంబంధిత సమస్యతో నగరంలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ మరో రెండు రోజుల్లో డిశ్చార్జి అయ్యే అవకాశముంది.

ముంబై: గుండె సంబంధిత సమస్యతో నగరంలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ మరో రెండు రోజుల్లో డిశ్చార్జి అయ్యే అవకాశముంది. ఈ నెల 15న అసౌకర్యంగా ఉండటంతో ఆస్పత్రిలో చేరిన దిలీప్ ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడుతోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయన కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్జి అయ్యే అవకాశముందని వెల్లడించాయి. కాగా, దిలీప్‌ను బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ సోమవారం కలిసి పరామర్శించారు. అంతకుముందు బాలీవుడ్ నటులు షబానా అజ్మీ, ఫరీదా జలాల్, ఆశా పరేఖ్, రాజా మురద్, కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా కూడా దిలీప్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

 

ఆరు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో రాణించిన దిలీప్‌కు మధుమతి, దేవ్‌దాస్, ముఖల్ ఈ అజామ్, గంగా జమునా, రామ్ ఔర్ శ్యామ్, కర్మ తదితర సినిమాలు నటునిగా మంచి పేరు తెచ్చి పెట్టాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement