విషాదం.. భగత్ సింగ్ మునిమనవడు మృతి | Bhagat Singh's grand nephew killed in road accident | Sakshi
Sakshi News home page

విషాదం.. భగత్ సింగ్ మునిమనవడు మృతి

May 29 2016 2:56 PM | Updated on Aug 30 2018 4:07 PM

విషాదం.. భగత్ సింగ్ మునిమనవడు మృతి - Sakshi

విషాదం.. భగత్ సింగ్ మునిమనవడు మృతి

స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ముని మనవడు అభితేజ్ సింగ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.

సిమ్లా: స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ముని మనవడు అభితేజ్ సింగ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. హిమాచల్ ప్రదేశ్ లో రామ్ పూర్ సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అభితేజ్ సింగ్(27) ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లాడు. మిత్రుడు సనావార్ తో కలిసి బైక్ పై ఇంటికి వెళ్తున్నాడు. వీరి వెనకాలే గురుపాల్ సింగ్, అభితేష్ కారులో ప్రయాణమయ్యారు. రామ్ పూర్ సమీపంలో మ్యాంగ్లాడ్ వద్ద బైక్ అదుపు తప్పింది. బైక్ పై వెళ్తోన్న అభితేజ్, సనావార్ కింద పడ్డారు. అయితే అభితేజ్ కు మాత్రం తల, పక్కటెముకల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.

చికిత్స నిమిత్తం రామ్ పూర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొన్ని నిమిషాల్లోనే అతడు చనిపోయాడు. రోడ్డు తడిగా ఉండటంతో బైక్ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని అభితేజ్ స్నేహితులు చెప్పారు. పోస్టుమార్టం చేసిన తర్వాత మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. మోహాలీలో సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తారని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement