పెళ్లిపీటలెక్కుతున్న హీరోయిన్ | Sakshi
Sakshi News home page

పెళ్లిపీటలెక్కుతున్న హీరోయిన్

Published Tue, Jul 14 2015 8:55 AM

పెళ్లిపీటలెక్కుతున్న హీరోయిన్

మరో హీరోయిన్ పెళ్లికూతురు కాబోతుంది. 'విలేజ్లో వినాయకుడు, కబడ్డీ కబడ్డీ, హ్యాపీ హ్యాపీగా' చిత్రాల్లో నటించిన ఆమె త్వరలో వివాహం చేసుకోబోతుంది. అమాయకంగా, పక్కింటి అమ్మాయిలా ఉండే శరణ్యా మోహన్ తెలుగులో కొన్ని చిత్రాల్లోనే నటించినా తన నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది.  ఇటీవలే ఆమెకు ఓ దంత వైద్యుడు అరవింద్ కృష్ణన్తో కుటుంబ సభ్యులు నిశ్చితార్థం జరిపించారు. ఈ విషయాన్ని శరణ్యా మోహనే స్వయంగా (జులై 12న) తన ఫేస్బుక్ ద్వారా తెలిపింది. తన జీవితంలో ఇది చాలా ముఖ్యమైందని ఆమె పేర్కొంది.

'కాదలుక్కు మరియాదై' చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన  మలయాళీ బ్యూటీ శరణ్యామోహన్. ఆ చిత్రంలో మాదిరిగానే పలు చిత్రాల్లో చెల్లెలిగా నటించిన ఆమె అనంతరం 'వెన్నెలాకబడ్డీకుళు' చిత్రంతో కథానాయికిగా ఎదిగారు. త్వరలో వీరి వివాహం జరగనుంది. బెస్ట్ ఆఫ్ లక్ శరణ్యా మోహన్.


'I am taking this opportunity to officially announce you all about the most important day of my life that is about to come...my marriage...I got engaged today to Aravind Krishnan, Doctor by profession. Please do pray for me even after marriage. Thanking you all for the love and support'

Advertisement
 

తప్పక చదవండి

Advertisement