కొరటాల మూవీలో చిరు ద్విపాత్రాభినయం..? | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 4 2018 8:17 PM

Will Chiranjeevi Do Dual Role In Koratala Siva Movie - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం సైరా షూటింగ్‌లో బిజీగా ఉంటున్నారు. అయితే ఈ సినిమాను చేస్తూనే కొరటాల శివ మూవీని కూడా చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబందించిన వార్తలు సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొరటాల, చిరు మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు కానీ, దాదాపు ఖరారు అయినట్టే అని ఇండస్ట్రీలో టాక్‌. 

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త నెట్టింట్లో తిరుగుతోంది. కొరటాల శివతో చేయబోయే మూవీలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే మెగా అభిమానులకు పండుగే. కొరటాల మూవీని అక్టోబర్‌లో ప్రారంభించేందుకు అవకాశం ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement