డబుల్‌ ధమాకా | Where Is The Venkatalakshmi and Cinderella Movie First Looks release | Sakshi
Sakshi News home page

డబుల్‌ ధమాకా

Nov 5 2018 2:29 AM | Updated on Nov 5 2018 2:29 AM

Where Is The Venkatalakshmi and Cinderella Movie First Looks release - Sakshi

‘సిండ్రెల్లా లుక్‌, రాయ్‌లక్ష్మి, వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి లుక్‌

రాయ్‌లక్ష్మికి నిన్న (ఆదివారం) స్పెషల్‌ డే. ఎందుకంటే ఆమె నటిస్తున్న రెండు సినిమాల ఫస్ట్‌ లుక్‌లు ఒకే రోజు విడుదలయ్యాయి. తమిళంలో రాయ్‌లక్ష్మి నటిస్తున్న ఫాంటసీ కమ్‌ హారర్‌ మూవీ ‘సిండ్రెల్లా’. ఈ సినిమాతో వినోద్‌ వెంకటేశ్‌ కోలీవుడ్‌కు దర్శకునిగా పరిచయం అవుతున్నారు.  ఆమె తెలుగులో నటిస్తున్న హాస్య భరిత చిత్రం ‘వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి’. ఈ సినిమాతో కిషోర్‌ కుమార్‌ దర్శకునిగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. ‘సిండ్రెల్లా, వేర్‌ ఈజ్‌ ద వెంటకలక్ష్మి’ సినిమాలో ఆమె ఫస్ట్‌ లుక్స్‌ ఆదివారం విడుదల అయ్యాయి.

‘‘నా రెండు సినిమాల ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ యాదృచ్ఛికంగా ఒకే రోజు రిలీజ్‌ కావడం ఆనందంగా ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి’ సినిమాలో ప్రవీణ్, మధునందన్‌తో కలిసి పనిచేయడం బాగుంది. సెట్‌లో చాలా సరదాగా ఉంటున్న ‘సిండ్రెల్లా’ టీమ్‌కి కూడా థ్యాంక్స్‌. త్వరలో విడుదలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తాం’’ అని పేర్కొన్నారు రాయ్‌లక్ష్మి. ఎలాగైతేనేం.. దీపావళికి ముందుగానే తన అభిమానులకు డబుల్‌ ధమాకా ఇచ్చారు రాయ్‌లక్ష్మి.

Advertisement
 
Advertisement
Advertisement