గూగుల్‌ ఇంట్లో ఆయనదే హాట్‌ టాపిక్‌ | wedding in november, arrest in july: Dileep | Sakshi
Sakshi News home page

గూగుల్‌ ఇంట్లో ఆయనదే హాట్‌ టాపిక్‌

Jul 13 2017 2:37 PM | Updated on Sep 28 2018 4:15 PM

గూగుల్‌ ఇంట్లో ఆయనదే హాట్‌ టాపిక్‌ - Sakshi

గూగుల్‌ ఇంట్లో ఆయనదే హాట్‌ టాపిక్‌

ప్రముఖ నెట్‌ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌లో ఇప్పుడు ఒకే అంశానికి సంబంధించిన కథనాలకోసం తెగ గాలిస్తున్నారు. గత మూడు రోజులుగా ఇదే అంశం ట్రెండింగ్‌ భారీ స్థాయిలో అవుతోంది.

తిరువనంతపురం: ప్రముఖ నెట్‌ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌లో ఇప్పుడు ఒకే అంశానికి సంబంధించిన కథనాలకోసం తెగ గాలిస్తున్నారు. గత మూడు రోజులుగా ఇదే అంశం ట్రెండింగ్‌ భారీ స్థాయిలో అవుతోంది. అదేమిటంటే దిలీప్‌ గురించి. అవును ఓ ప్రముఖ నటి కిడ్నాప్‌, లైంగిక వేధింపులకు సంబంధించి అరెస్టయి ప్రస్తుతం విచారణ ఖైదీగా ఉన్న దిలీప్‌ వ్యక్తిగత విషయాలను, ఇతర వివాదాస్పద అంశాలను బాగా వెతుకుతున్నారు. గత నవంబర్‌లో ఆయన అనూహ్యంగా కావ్య మాధవన్‌ అనే మలయాళ నటిని చేసుకున్నప్పుడు ఏ విధంగానైతే గూగుల్‌లో వెతికారో ఇప్పుడు అదే విధంగా ఆయన గురించి మరోసారి నెటిజన్లు వాకబు చేయడం మొదలు పెట్టారు.

ఇదేదో ఒక్క భారత్‌లోనే అనుకుంటే అదీ కాదు.. అటు అమెరికాలో, గల్ఫ్‌ దేశాల్లో కూడా దిలీప్‌ గురించి శోధించడం మొదలుపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17 షూటింగ్‌ వెళ్లి వస్తున్న ప్రముఖ నటిని కిడ్నాప్‌ చేయి కారులోనే లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో దిలీప్‌ కుట్ర ఉందనే పేరిట పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. గత నవంబర్‌లోనే పెళ్లి చేసుకున్న దిలీప్‌ జులై నాటికి జైలులో అడుగుపెట్టారని ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. అంతేకాదు, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌వంటి పలు సామాజిక మాధ్యమాల్లో కూడా ఇప్పుడు ఈ విషయం తెగ ట్రెండింగ్‌ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement