ఇంకొక్కడు సక్సెస్తో జోరు పెంచాడు | Vikram Next movie with gautham menon | Sakshi
Sakshi News home page

ఇంకొక్కడు సక్సెస్తో జోరు పెంచాడు

Nov 10 2016 12:21 PM | Updated on Sep 28 2018 7:36 PM

ఇంకొక్కడు సక్సెస్తో జోరు పెంచాడు - Sakshi

ఇంకొక్కడు సక్సెస్తో జోరు పెంచాడు

కొంతకాలంగా సరైన హిట్స్ లేక ఇబ్బందుల్లో ఉన్న చియాన్ విక్రమ్ ఇప్పుడు స్పీడు పెంచాడు. ఇటీవల ఇరుముగన్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన చియాన్, అదే జోరును కంటిన్యూ చేసేందుకు రెడీ...

కొంతకాలంగా సరైన హిట్స్ లేక ఇబ్బందుల్లో ఉన్న చియాన్ విక్రమ్ ఇప్పుడు స్పీడు పెంచాడు. ఇటీవల ఇరుముగన్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన చియాన్, అదే జోరును కంటిన్యూ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అందుకే వరుసగా సినిమాలు అంగకీరిస్తూ ఫాం కొనసాగించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమా కోసం రెడీ అవుతున్న విక్రమ్ మరో రెండు చిత్రాలను లైన్ లో పెట్టాడు.

త్వరలో హరి దర్శకత్వంలో సామి సినిమాకు సీక్వల్ ను పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమా తరువాత తన స్వీయ దర్శకత్వంలో హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా డోంట్ బ్రీత్ ను రీమేక్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఈ రెండు సినిమాలు లైన్ లో ఉండగానే స్టైలిష్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మరో సినిమాను అంగీకరించాడు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా 2017లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు విక్రమ్.

Advertisement
 
Advertisement
Advertisement