భారీ కటౌట్‌ | Vijay Fans 175 Feet Cutout Mass Celebration | Sakshi
Sakshi News home page

భారీ కటౌట్‌

Nov 5 2018 2:17 AM | Updated on Nov 5 2018 2:17 AM

Vijay Fans 175 Feet Cutout Mass Celebration - Sakshi

కీర్తీ సురేశ్, విజయ్‌

అభిమాన హీరో సినిమా విడుదలవుతోందంటే ఫ్యాన్స్‌కి పండుగే. హీరో కటౌట్లు పెట్టి, ఫ్లెక్లీలు కట్టి బాణసంచా కాల్చుతూ సందడి చేస్తుంటారు. తమిళ హీరో విజయ్‌కి అభిమానుల్లో ఎంత క్రేజ్‌ ఉందో తెలిసిందే. తమిళనాడులోనే కాదు.. కేరళలోనూ ఆయనకు అభిమానులున్నారు. తాజాగా విజయ్‌ నటించిన ‘సర్కార్‌’ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కేరళకు చెందిన కొల్లం నన్బన్‌ ఫ్యాన్‌ క్లబ్‌ సభ్యులు విజయ్‌ కోసం 175 అడుగుల భారీ కటౌట్‌ను రూపొందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. ‘తుపాకీ, కత్తి’ సినిమాల తర్వాత విజయ్‌– డైరెక్టర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సర్కార్‌’. కీర్తీ సురేశ్, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ హీరోయిన్లు. కళానిధి మారన్‌ నిర్మాత. ఈ చిత్రాన్ని నిర్మాత అశోక్‌ వల్లభనేని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. రేపు(మంగళవారం) విడుదల కానున్న ఈ సినిమాపై తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్‌ ఏర్పడింది. కర్ణాటక, కేరళలో దీపావళి రోజున 24 గంటలు సినిమాను ప్రదర్శించేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. అంటే దీపావళి రోజున ఒక్కో థియేటర్‌లో ‘సర్కార్‌’ వరుసగా 8 షోలు ప్రదర్శించబోతుండటం విశేషం. ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్‌. రెహమాన్‌.

Advertisement
 
Advertisement
Advertisement