మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో విజయ్‌ దేవరకొండ | Vijay Devarakonda Signs Another Bilingual Movie | Sakshi
Sakshi News home page

Dec 12 2018 4:02 PM | Updated on Dec 12 2018 8:04 PM

Vijay Devarakonda Signs Another Bilingual Movie - Sakshi

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. అర్జున్‌ రెడ్డి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో తెలుగుతో పాటు ఇతర భాషల మీద కూడా దృష్టి పెడుతున్నాడు. ఇప్పటికే నోటా సినిమాతో కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన విజయ్‌, బాలీవుడ్ లోనూ త్వరలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం విజయ్‌ దేవరకొండ మరో తమిళ సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్ ఆసక్తికర చిత్రాలను తెరకెక్కిస్తున్న డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ శ్రీ కార్తీక్‌ ను దర్శకుడి పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో విజయ్‌ హీరోగా నటించనున్నాడు.

ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణతో పాటు యోగిబాబులు నటించనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలుడనుంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ డియర్‌ కామ్రేడ్‌ సినిమాతో పాటు క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement