‘దేవదాస్‌’తో బాలీవుడ్ ప్రొడక్షన్‌ కం‍పెనీ..!

Viacom 18 Group Is Getting Associated With DevaDas - Sakshi

ముంబాయి కి చెందిన ప్రముఖ మీడియా సంస్థ వయాకామ్ 18 మీడియా ప్రతిష్టాత్మక వైజయంతి సంస్థతో చేతులు కలిపింది. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో నిర్మిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ దేవదాస్ చిత్రానికి వయాకామ్ 18 భాగస్వామిగా దక్షిణాది చిత్ర సీమలో అడుగు పెట్టనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత అశ్వినిదత్ మాట్లాడుతూ, వయాకామ్ 18తో భాగస్వామి గా కావడం చాలా ఆనందంగా ఉంది. వారితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాం.  దేవదాస్ తో దక్షిణాది చిత్ర సీమ లోకి ప్రవేశిస్తున్న వారికి టాలీవుడ్ తరపున ఘన స్వాగతం పలుకుతున్నాం’ అన్నారు.

వయా కామ్ 18 సీఓఓ అజిత్ అంధారే మాట్లాడుతూ,  ‘అశ్వినిదత్ గారి ప్రఖ్యాత వైజయంతి మూవీస్ సంస్థ భాగస్వామ్యం లో భారీ చిత్రం దేవదాస్ తో తెలుగు చిత్రసీమలోకి ప్రవేశిస్తున్నందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. మా సంస్థ తెలుగులో అనేక దశాబ్దాల అనుభవం ఉన్న దత్ గారు, వైజయంతి మూవీస్ భాగస్వామ్యం తో మరింతగా విస్తరించేందుకు కృషి చేస్తాం. కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నానిల కలయికలో టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న, అందరూ ఎంత గానో ఎదురు చూస్తున్న దేవదాస్ తో వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంద’న్నారు.

శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్‌, రష్మిక మందన్నలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top