సూపర్‌ సవాల్‌ | Varalaxmi plays a blind girl in her next film | Sakshi
Sakshi News home page

సూపర్‌ సవాల్‌

Jul 8 2018 12:35 AM | Updated on Apr 3 2019 4:04 PM

Varalaxmi plays a blind girl in her next film - Sakshi

వరలక్ష్మీ శరత్‌కుమార్‌

అడుగులు ముందుకు వేయడానికి చెవులకు, బ్రెయిన్‌కి పని చెబుతున్నారు కథానాయిక వరలక్ష్మీ శరత్‌కుమార్‌. అంత అందమైన కళ్లు ఉంటే ఇలా ఎందుకు చేస్తున్నారు? అంటే నిజ జీవితంలో చేయడం లేదు. సినిమాలో క్యారెక్టర్‌ కోసం చేస్తున్నారు. ఆల్రెడీ అరడజను సినిమాలతో బిజీగా ఉన్న వరలక్ష్మీ మరో సినిమాకు పచ్చజెండా ఊపారు. జేకే అనే అతను ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు.

ఈ సినిమాలో బ్లైండ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు వరలక్ష్మీ. ‘‘కొత్త సినిమా మొదలైంది. ప్రేక్షకుల ఆశీర్వాదం కావాలి. తొలిసారి బ్లైండ్‌ క్యారెక్టర్‌లో నటించబోతున్నాను. ఇది నాకు సూపర్‌ చాలెంజింగ్‌ రోల్‌. సూపర్‌ ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు వరలక్ష్మీ శరత్‌ కుమార్‌. ఈ సినిమాకు శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్నారు. మాథ్యూ ఛాయాగ్రాహకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement