నో హాలిడే | Vamsi Paidipally directed  Mahesh Babu is the film Maharishi | Sakshi
Sakshi News home page

నో హాలిడే

Feb 10 2019 1:06 AM | Updated on Feb 10 2019 1:06 AM

Vamsi Paidipally directed  Mahesh Babu is the film Maharishi - Sakshi

విలన్స్‌ తాట తీస్తున్నారు మహేశ్‌బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మహర్షి’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగుతోంది. యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ ఫైట్‌ ఈ రోజుతో కంప్లీట్‌ అవుతుంది. అంటే.. సండే ‘మహర్షి’ యూనిట్‌కి నో హాలిడే అన్నమాట.

నెక్ట్స్‌ హైదరాబాద్‌లోని మరో స్టూడియోలో వేసిన సెట్‌లో మరో ఫైట్‌ను షూట్‌ చేస్తారు చిత్రబృందం. ఈ ఫైట్‌ను నాలుగురోజుల పాటు చిత్రీకరిస్తారని సమాచారం. ఆ తర్వాత చిన్న బ్రేక్‌ తీసుకుని ఫారిన్‌ షెడ్యూల్‌ కోసం ‘మహర్షి’ టీమ్‌ ఫ్లైట్‌ ఎక్కుతుందట. ఇందులో స్టూడెంట్‌గా, బిలియనీర్‌గా కనిపిస్తారు మహేశ్‌. రిషి పాత్రలో మహేశ్‌బాబు, రవి పాత్రలో అల్లరి నరేశ్, మహా పాత్రలో పూజా హెగ్డే కనిపిస్తారు. ఆల్రెడీ ‘మహర్షి’ సినిమా డబ్బింగ్‌ కార్యక్రమాలు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 25న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement