ఆత్మహత్య చేసుకుంది నా భర్త కాదు: నటి | TV Actress Rekha React on Her Husband Suicide News | Sakshi
Sakshi News home page

ఆత్మహత్య చేసుకుంది నా భర్త కాదు: నటి

Dec 30 2019 7:35 AM | Updated on Dec 30 2019 7:45 AM

TV Actress Rekha React on Her Husband Suicide News - Sakshi

చెన్నై, పెరంబూరు: ఆత్మహత్యకు పాల్పడి మరణించింది తన భర్త కాదని బుల్లితెర నటి రేఖ పేర్కొంది. ఈ నెల 25న గోపీనాథ్‌ అనే వ్యక్తి పెరంబూరులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతను బుల్లితెర నటి, వ్యాఖ్యాత రేఖ భర్త అని, తన కార్యాలయంలో పని చేసే వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఈ వ్వవహారం కారణంగా గోపీనాథ్‌ రేఖ మధ్య తరుచూ గొడవలు జరిగేవని ప్రచారం జరిగింది. అక్రమ సంబంధం, అప్పుల బాధ కారణంగా గోపీనాథ్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని చర్చ జరిగింది. ఈ ప్రచారంపై బుల్లితెర నటి రేఖ స్పందిస్తూ.. ఆత్మహత్య చేసుకుంది తన భర్త కాదని, అతని భార్య పేరు జెనీఫర్‌ రేఖ అని తెలిపింది. ఆమె పేరులో రేఖ ఉండడంతో తన భర్త గోపీనాథ్‌ అని ప్రచారం చేశారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement