చైతూ... ఆ అమ్మాయి ఎవరు? | Telugu remake of 'Premam' to star Shruti Haasan with Naga Chaitanya | Sakshi
Sakshi News home page

చైతూ... ఆ అమ్మాయి ఎవరు?

Aug 9 2016 11:00 PM | Updated on Sep 4 2017 8:34 AM

చైతూ... ఆ అమ్మాయి ఎవరు?

చైతూ... ఆ అమ్మాయి ఎవరు?

అక్కినేని యువ మన్మథుడు నాగచైతన్య ‘ఎవరే... ఎవరే..’ అంటూ పాట పాడుతున్నాడు. ‘చైతూ.. ఆ అమ్మాయి ఎవరు?

అక్కినేని యువ మన్మథుడు నాగచైతన్య ‘ఎవరే... ఎవరే..’ అంటూ పాట పాడుతున్నాడు. ‘చైతూ.. ఆ అమ్మాయి ఎవరు?’ అనడిగితే.. సమాధానం మాత్రం చెప్పడం లేదు. సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. చైతు ఎవర్ని ఊహించుకుని పాట పాడాడో? తెలియాలంటే మరి కొన్ని రోజుల వరకూ ఎదురు చూడక తప్పదు.
 
 నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రేమమ్’. శ్రుతీహాసన్, మడోన్నా సెబాస్టియన్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 24న పాటల్ని, సెప్టెంబర్ 9న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. విజయ్ ఏసుదాస్ పాడిన ‘ఎవరే ఎవరే...’ పాటను ఈ నెల 18న రేడియోలలో విడుదల చేస్తున్నారు.
 
  శ్రీమణి ఈ పాట రాశారు. మలయాళంలో మంచి హిట్టయిన ‘ప్రేమమ్’కు ఈ సినిమా రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఈశ్వరీరావు, జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాసరెడ్డి, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: ఆల్ఫోన్సె పుధరిన్, కళ: సాహి సురేశ్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు, కెమేరా: కార్తీక్ ఘట్టమనేని, సమర్పణ: పీడీవీ ప్రసాద్, సంగీతం: గోపీసుందర్, రాజేశ్ మురుగన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement