సెప్టెంబర్ 6న ‘ఉండి పోరాదే’ | Telugu Movie Undiporaadhey Release Date Announced | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 6న ‘ఉండి పోరాదే’

Aug 27 2019 4:23 PM | Updated on Aug 27 2019 4:23 PM

Telugu Movie Undiporaadhey Release Date Announced - Sakshi

తరుణ్ తేజ్, లావణ్య హీరోహీరోయిన్లుగా రూపొందిన ఫీల్ గుడ్  ఫ్యామిలీ ఎంటర్టైనర్  'ఉండి పోరాదే'. గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో డాక్టర్ లింగేశ్వర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నవీన్ నాయని దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సింగల్ కట్ కూడా లేకుండా  యూ/ ఏ సర్టిఫికెట్ పొందింది. సెప్టెంబర్ 6న సినిమా గ్రాండ్ గా విడుదలవుతుంది.

ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాత డా. లింగేశ్వర్ మాట్లాడుతూ - ‘మా ఉండి పోరాదే చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యూ/ఏ పొందింది. సెన్సార్ వారు సింగల్ కట్ కూడా లేకుండా ఈ మధ్యకాలంలో ఒక మంచి సినిమా చూశాం అని.. నన్ను మా టీమ్‌ను అభినందించారు.  నేను గ‌తంలో చెప్పిన‌ట్టు సినిమా 100ప‌ర్సెంట్ స‌క్సెస్ అవుతుంది అనే కాన్ఫిడెంట్  మరింత పెరిగింది. లాస్ట్ 20 మినిట్స్ లో మన ప‌క్కన  ఉన్నవారిని కూడా మ‌ర్చి పోయేలా సినిమా ఉంటుంది. అంద‌రూ థియేటర్ లో  సినిమా చూసి పెద్ద స‌క్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను’అన్నారు.

ద‌ర్శకుడు న‌వీన్ నాయ‌ని మాట్లాడుతూ... ‘ఇంత మంచి సినిమా చేసే అవ‌కాశం ఇచ్చిన నిర్మాత లింగేశ్వర్‌ గారికి థాంక్స్. సినిమా మేము అనుకున్న దానిక‌న్నా హార్ట్ ట‌చింగ్‌గా వచ్చింది. సినిమా కోసం ప్రతి టెక్నీషియ‌న్ 100ప‌ర్సెంట్ ఎఫ‌ర్ట్ పెట్టారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 6న మీ ముందుకు వస్తున్నాం. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement