ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు! | Tamanna about her marriage | Sakshi
Sakshi News home page

ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు!

Nov 19 2016 1:25 AM | Updated on Sep 4 2017 8:27 PM

ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు!

ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు!

నాకు వివాహబంధం అంటే నమ్మకం, గౌరవం ఉన్నారుు కానీ.. అంటున్నారు నటి తమన్నా. ఆమె ఉద్దేశం ఏమిటో చూద్దాం.

నాకు వివాహబంధం అంటే నమ్మకం, గౌరవం ఉన్నారుు కానీ.. అంటున్నారు నటి తమన్నా. ఆమె ఉద్దేశం ఏమిటో చూద్దాం. ఇటీవల ముఖ్యంగా కోలీవుడ్‌లో నటిగా తమన్నా స్థారుుని పెం చిన చిత్రాల్లో బాహుబలి, తోళా(తెలుగులో ఊపిరి) ధర్మదురై, ఇటీవల విడుదలైన దేవీ చిత్రాలను చెప్పుకోవచ్చు. తాజాగా విశాల్‌తో జత క ట్టిన కత్తిసండై త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ మిల్కీబ్యూటీని పలకరిస్తే చాలానే చెప్పుకొచ్చారు. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అలాంటి చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తానని అంటున్నారు.

ఇటీవల తాను నటించిన చిత్రాల్లో తన పాత్రలకు మంచి ప్రాముఖ్యత లభించిందన్నారు. బాహుబలి చిత్రాన్నే తీసుకుంటే అందులో పోషించిన అవంతిక పాత్ర చాలా బోల్డ్ అండ్ ఫోకసింగ్ యువతి పాత్ర అని తెలిపారు. ఇంకా చెప్పాలంటే ఆ పాత్రతోనే బాహుబలి చిత్ర కథ ముందుకు సాగుతుందన్నారు. అదే విధంగా దేవీ చిత్రంలో చాలా ఛాలెంజిగ్ పాత్రను చేశానని చెప్పారు. ఇకపై అలాంటి పాత్రలను కోరుకుం టున్నానన్నారు. ఇప్పుడు పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా స్త్రీ పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించాలని చెప్పారు. అలాగని కమర్శియల్ కథా చిత్రాల్లో నటించనని చెప్పనన్నారు.

ఎం దుకంటే ప్రేక్షకులు కమర్శియల్ చిత్రాలను బాగా ఎంజాయ్ చేస్తారని అన్నారు. ఈ క్రమంలో పెళ్లి ప్రస్థావన తీసుకురాగా వివాహబంధంపై తనకు అపార గౌరవం, నమ్మకం ఉన్నాయని.. అరుుతే ప్రస్తుతానికి మాత్రం తనకు పెళ్లి ఆలోచన లేదన్నారు.సమయం వచ్చినప్పుడు ఆ విషయం గురించి చెబుతానని, ఇప్పుడు తన దృష్టంతా నటన మీదేననీ, దాన్నే ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement