అమ్మ అయిన రేష్మీమీనన్ | Taarak Mehta Ka Ooltah ChashmahFavourite | Sakshi
Sakshi News home page

అమ్మ అయిన రేష్మీమీనన్

Oct 24 2015 3:27 AM | Updated on Sep 3 2017 11:22 AM

అమ్మ అయిన రేష్మీమీనన్

అమ్మ అయిన రేష్మీమీనన్

ప్రతి స్త్రీ మాతృప్రేమను చవి చూసే తరుణం వ స్తుంది. నటి రేష్మీమీనన్ ప్రస్తుతం అలాంటి తల్లి ప్రేమను అనుభవిస్తున్నారు.

ప్రతి స్త్రీ మాతృప్రేమను చవి చూసే తరుణం వ స్తుంది. నటి రేష్మీమీనన్ ప్రస్తుతం అలాంటి తల్లి ప్రేమను అనుభవిస్తున్నారు. అదేంటి ఆమె తల్లి అవ్వడం ఏమిటీ? ఇటీవలేగా నటుడు బాబీ సింహాతో ప్రేమ కలాపాలు అంటూ ప్రచారం హోరెత్తింది అంటారా? నిజమే. అది రియల్ లైఫ్ కథ. ఇది రీల్‌లైఫ్ కహానీ. ఇంతకీ విషయం ఏమిటంటే రేష్మీమీనన్ భయమా ఇరుక్కు అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో ఆమె ఒక బిడ్డ కు తల్లిగా నటించడం విశేషం. సంతోష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వసంతం ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది.

కోవైసరళ, నన్‌కడవుల్ రాజేంద్రన్, విజయ్ టీవీ.జగన్, లోల్లుసభ జీవా, భరణీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.జవహర్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఈయన తెలుపుతూ ఇది వినోదం మేళవిం చిన వైవిధ్యభరిత థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పా రు. వివాహానంతరం భార్యాభర్తల మధ్య ప్రేమను ఆవిష్కరించే చిత్రం భయమా ఇరుక్కు అని తెలిపారు. ఇందులో రేష్మీమీనన్ బిడ్డకు తల్లిగా నటించారని చెప్పారు.

వీరిద్దరితోపాటు నాన్‌కడవుల్ రాజేంద్రన్ పాత్ర మొదటి నుంచి చివరి వరకూ పయనించే ముఖ్యమైన పాత్రగా ఉంటుందన్నారు. అదేవిధంగా కోవైసరళ స్వామీజీగా కీలక పాత్రలో నటిస్తున్నారని పేర్కొన్నారు. చిత్రం తొలి ఘట్టం షూటింగ్‌ను కేరళలో పూర్తి చేసినట్లు, రెండో ఘట్టం షూటింగ్‌ను చెన్నైలో చిత్రీకరిస్తునట్లు వెల్లడించారు. ఇందులో ఒక ఇల్లు ముఖ్య భూమికగా ఉంటుందన్నారు. కేరళలో జనసంచారానికి దూరంగా ఉన్న ఒక ఇంటిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. ఎలాంటి రవాణా వసతులు లేని ఆ ఇంటిని చేరడానికి బోటులో మూడు గంటల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement