మరోసారి లీకైన ‘సైరా’ స్టిల్స్‌ | Sye Raa Narasimhareddy War Scene Photos Leaked | Sakshi
Sakshi News home page

Jul 29 2018 10:23 AM | Updated on Sep 3 2019 8:44 PM

Sye Raa Narasimhareddy War Scene Photos Leaked - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఖైదీ నంబర్‌ 150తో గ్రాండ్‌ రీ ఎంట్రీ ఇచ్చిన చిరు లాంగ్‌ గ్యాప్‌ తరువాత తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు లీకులు బెడద తప్పటం లేదు. గతంలో బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ నటించిన సన్నివేశాలకు సంబంధించిన స్టిల్స్‌ను ఆయనే స్వయంగా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయటంతో చిత్రయూనిట్ షాక్‌ అయ్యింది.

తరువాత ఎలాంటి స్టిల్స్‌ లీక్‌ అవ్వకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు చిత్రయూనిట్. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకులు మాత్రం ఆగటంలేదు. ఇటీవల సినిమా లోకేషన్‌కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. తాజాగా యుద్ధ సన్నివేశాలకు సంబంధించి ఫొటోలు నెట్‌లో సర్క్యూలేట్ అవుతున్నాయి. ఈ ఫొటోలలో నటీనటులు కనిపించకపోయినా.. ఓ భారీ కోట తగలబడుతున్న స్టిల్‌తో పాటు కొందరు బ్రిటీష్‌ సైనికుల దుస్తుల్లో ఉన్న స్టిల్‌ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement