పాంచ్‌ పటాకా! | Sushant Singh Rajput Returns As M S Dhoni In Biopic Sequel | Sakshi
Sakshi News home page

పాంచ్‌ పటాకా!

Sep 18 2018 1:16 AM | Updated on Sep 18 2018 1:16 AM

Sushant Singh Rajput Returns As M S Dhoni In Biopic Sequel - Sakshi

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌

ధోని బయోపిక్‌తో బాలీవుడ్‌లో మంచి బ్రేక్‌ అందుకున్నారు యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌. ఈ హీరో వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు కానీ ఈ ఏడాది ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా స్క్రీన్‌పై కనిపించలేదు. సోనాక్షి సిన్హా కథానాయికగా నటించిన ‘వెల్కమ్‌ న్యూయార్క్‌’లో చిన్న గెస్ట్‌ రోల్‌ చేశారంతే.  ఈ ఏడాది కనిపించని గ్యాప్‌నంతా వచ్చే ఏడాది పూర్తి చేయడానికి ఫిక్స్‌ అయినట్లున్నారు సుశాంత్‌. వచ్చే ఏడాది ఏకంగా ఐదు రిలీజ్‌లతో బాక్సాఫీస్‌ వద్ద పాంచ్‌ పటాకా పేల్చనున్నారు. వచ్చే ఏడాది ‘డ్రైవ్, కేథార్‌నాథ్, సోంచిరియా, కిజీ ఔర్‌ మ్యానీ, చిచోరా’ సినిమాలతో సందడి చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement