కండలు ఇంకా పెంచాలి: సల్మాన్ | 'Sultan' is going to be a stressful film: Salman | Sakshi
Sakshi News home page

కండలు ఇంకా పెంచాలి: సల్మాన్

Jul 7 2015 4:26 PM | Updated on Apr 3 2019 6:23 PM

కండలు ఇంకా పెంచాలి: సల్మాన్ - Sakshi

కండలు ఇంకా పెంచాలి: సల్మాన్

వచ్చే ఏడాది తెరమీదకు రానున్న తన కొత్త చిత్రం సుల్తాన్ ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలన్నింటికన్నా ఎక్కువ వత్తిడిని కలిగించే సినిమా అని ప్రముఖ బాలీవుడ్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ అన్నారు

ముంబయి: వచ్చే ఏడాది తెరమీదకు రానున్న తన కొత్త చిత్రం సుల్తాన్ ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలన్నింటికన్నా ఎక్కువ ఒత్తిడిని కలిగించే సినిమా అని ప్రముఖ బాలీవుడ్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ అన్నారు. ఈ సినిమా కోసం తాను మానసికంగా, శారీరకంగా మరింత ధృడంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం తాను ఎంతో శ్రమిస్తున్నానని చెప్పారు.

ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు చాలా ఉన్నాయని, ఇందుకోసం తాను ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. నవంబర్ నుంచి చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుందని ఇందులో రెజ్లింగ్ టైప్ సన్నివేశాలు ఉంటాయని, ఇందుకోసం పెద్దపెద్ద బరువులు ఎత్తాల్సి ఉందని, కండలు మరింత పెంచాలని, ఇంకా శక్తిమంతంగా తయారవ్వాలని ఆయన చెబుతున్నారు. 2016 ఈద్కు సుల్తాన్ విడుదల చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement