స్వచ్ఛమైన ప్రేమకథ | Sri divya For Varadhi movie | Sakshi
Sakshi News home page

స్వచ్ఛమైన ప్రేమకథ

Feb 17 2015 11:44 PM | Updated on Sep 2 2017 9:29 PM

స్వచ్ఛమైన ప్రేమకథ

స్వచ్ఛమైన ప్రేమకథ

క్రాంతి, శ్రీదివ్య, హేమంత్ హీరో హీరోయిన్లుగా సతీష్ కార్తికేయ దర్శకత్వంలో వివేకానంద వర్మ నిర్మించిన చిత్రం ‘వారధి’.

క్రాంతి, శ్రీదివ్య, హేమంత్ హీరో హీరోయిన్లుగా సతీష్ కార్తికేయ దర్శకత్వంలో వివేకానంద వర్మ నిర్మించిన చిత్రం ‘వారధి’. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు జీవీ రామరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘మంచి కథాంశంతో ఈ చిత్రం చేశాం. దర్శకునిగా తొలి చిత్రమైనప్పటికీ చిత్రబృందం అందించిన సహకారం వల్ల అనుకున్న విధంగా పూర్తి చేయగలిగాం. త్వరలో పాటలను, ఈ నెలాఖరున లేక వచ్చే నెల మొదటివారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. నలుగురి బాధలో సంతోషం వెతుక్కునే ఓ యువకుడు, నలుగురి సంతోషాన్ని కోరుకునే ఓ యువతి మధ్య జరిగే ప్రేమకథ ఇదని క్రాంతి చెప్పారు. క్రాంతి, దివ్య, నేనూ కలిసి నటించిన ఎమోషనల్ జర్నీ ఈ సినిమా అని హేమంత్ అన్నారు. మానవీయ విలువలు ఎలా ఉండాలనే అంశానికి వాణిజ్య  అంశాలు జోడించి, తీసిన స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రమిదని శ్రీదివ్య చెప్పారు. మంచి పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు విజయ్ గొర్తి అన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement