హాట్‌ హాట్‌ కరీనా.. అభిమానులు ఫిదా! | Snapshot: Kareena Kapoor sets the temperature soaring with these drool-worthy pictures from a recent photoshoot | Sakshi
Sakshi News home page

హాట్‌ హాట్‌ కరీనా.. అభిమానులు ఫిదా!

Jan 10 2016 11:11 AM | Updated on Sep 3 2017 3:26 PM

హాట్‌ హాట్‌ కరీనా.. అభిమానులు ఫిదా!

హాట్‌ హాట్‌ కరీనా.. అభిమానులు ఫిదా!

సాధారణంగా మగువలు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే.. పురుషులు ఇట్టే ఫిదా అయిపోతారు.

ముంబై: సాధారణంగా మగువలు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే.. పురుషులు ఇట్టే ఫిదా అయిపోతారు. ఎరుపులోనే ఆ మెరుపు ఉంది. బాలీవుడ్ ప్రౌఢ సుందరి కరీనా కపూర్ ఖాన్ కూడా తాజాగా రెడ్‌ ఔట్‌ఫిట్స్‌తో ఫొటోషూట్‌ చేసి.. అభిమానుల హృదయాల్లో గుబులు రేపుతోంది. బార్సిలోనాలో కరీనా కపూర్ తాజా ఫొటోషూట్ చిత్రాలను ఆమె హెయిర్‌ స్టైలిస్ట్‌ పంపీ హన్స్‌ సోషల్ మీడియాలో షేర్ చేశారు. గాఢమైన ఎరుపు రంగు దుస్తుల్లో హాట్‌హాట్‌గా పోజిస్తూ ఈ ఫొటోల్లో కరీనా కనువిందు చేస్తోంది.

'బజరంగీ భాయ్‌జాన్‌' చిత్రంతో తన కరిష్మా తగ్గలేదని చాటిన కరీన తాజాగా 'కి అండ్ కా' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో వయసులో తనకన్నా చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో జోడీ కట్టిన ఈ భామ తన అందచందాలు ఏమాత్రం తగ్గలేదని తాజా ఫొటోషూట్‌తో నిరూపించిందంటున్నారు బాలీవుడ్ జనాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement