సైమా 2019 : టాలీవుడ్‌ విజేతలు వీరే!

SIIMA Awards 2019 Telugu Winners List - Sakshi

దక్షిణాది సినీ రంగాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) కార్యక్రమాన్ని ఈ ఏడాది ఖతర్‌లోని దోహాలో నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఆగస్టు 15న ప్రారంభమైంది. తొలి రోజు తెలుగు, కన్నడ పరిశ్రమలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టాలీవుడ్ అవార్డ్స్‌లో అత్యథిక అవార్డులతో రంగస్థలం సత్తా చాటింది.

సైమా అవార్డ్స్‌ 2019 విజేతలు
ఉత్తమ చిత్రం : మహానటి
ఉత్తమ దర్శకుడు : సుకుమార్‌ (రంగస్థలం)
ఉత్తమ నటుడు : రామ్‌చరణ్‌ (రంగస్థలం)
ఉత్తమ నటి : కీర్తి సురేష్‌ (మహానటి)
విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు : విజయ్‌ దేవరకొండ( గీత గోవిందం)
విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి : సమంత (రంగస్థలం)
ఉత్తమ సహాయ నటుడు : రాజేంద్ర ప్రసాద్‌ ( మహానటి)
ఉత్తమ సహాయ నటి : అనసూయ (రంగస్థలం)
ఉత్తమ హాస్య నటుడు : సత్య (ఛలో)
ఉత్తమ విలన్‌ : శరత్‌ కుమార్‌ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్‌ (రంగస్థలం)
ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్‌ (ఎంత సక్కగున్నవవే - రంగస్థలం)
ఉత్తమ గాయకుడు : అనురాగ్ కులకర్ణి( పిల్ల రా - ఆర్‌ఎక్స్‌ 100)
ఉత్తమ గాయని : ఎంఎం మానసీ (రంగమ్మా మంగమ్మ - రంగస్థలం)
ఉత్తమ తొలిచిత్ర నటుడు : కల్యాణ్ దేవ్‌ (విజేత)
ఉత్తమ తొలిచిత్ర నటి : పాయల్‌ రాజ్‌పుత్‌ (ఆర్‌ఎక్స్‌ 100)
ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు : అజయ్‌ భూపతి (ఆర్‌ఎక్స్‌ 100)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ : రత్నవేలు (రంగస్థలం)
ఉత్తమ కళా దర్శకడు : రామకృష్ణ (రం‍గస్థలం)
సామాజిక మాధ్యమాల్లో పాపులర్‌ స్టార్ : విజయ్‌ దేవరకొండ
 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top