మరో ప్రేమ కోసం.. | Shruti Haasan React on Her Love Break up | Sakshi
Sakshi News home page

మరో ప్రేమ కోసం..

Oct 11 2019 8:29 AM | Updated on Oct 11 2019 8:29 AM

Shruti Haasan React on Her Love Break up - Sakshi

చెన్నై,టీ.నగర్‌: మరో ప్రేమ కోసం అన్వేషిస్తున్నట్లు నటి శ్రుతిహాసన్‌ వెల్లడించారు. నటి శ్రుతిహాసన్‌ లండన్‌ బాయ్‌ఫ్రెండ్‌ మైకెల్‌ కోర్సెల్‌తో డేటింగ్‌ చేశారు. ఇరువురూ ప్రేమజంటగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కొన్నేళ్ల పాటు సాగిన ఈ సంబంధాన్ని శ్రుతిహాసన్‌ హఠాత్తుగా బ్రేక్‌ అప్‌ చేశారు. డేటింగ్, ప్రేమంటూ ఏడాదికి పైగా కొత్త చిత్రాల్లో నటించని శ్రుతి ప్రస్తుతం నటించేందుకు అంగీకారం తెలుపుతోంది. ప్రస్తుతం విజయసేతుపతితో లాభం చిత్రంలో జంటగా నటిస్తున్నారు. హిందీ చిత్రంలో నటించేందుకు సమ్మతించారు.

ప్రియుడు మైకెల్‌తో బ్రేక్‌ అప్‌ అయిన విషయం గురించి మౌనం పాటిస్తూ వచ్చిన శ్రుతి బహిరంగంగా నోరు విప్పారు. ఆమె మాట్లాడుతూ మంచివారు కొన్ని సమయాల్లో మంచివారేనని, అదే వ్యక్తులు కొన్ని సమయాల్లో చెడ్డవారుగా మారుతారని తెలిపారు. ప్రేమ విఫలం కావడం గురించి తనకు ఎటువంటి బాధ లేదని, ఇది మొత్తానికి తనకు ఒక అనుభవంగా మిగిలిందన్నారు. ప్రేమకు ఇదే కండిషన్‌ అంటూ ఏమీ లేదని, ఈ ప్రేమ ద్వారా తాను ఎంతో నేర్చుకున్నట్లు తెలిపారు. ఇది నేర్చుకోవడం ద్వారా తెలిసిందని, తదుపరి ప్రేమ కోసం వేచివున్నట్లు తెలిపారు. అది చక్కని ప్రేమగా మిగులుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. అటువంటి ప్రేమ లభిస్తే దాని గురించి సంతోషంగా అందరితో పంచుకుంటానని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement