ఆ వార్తలు నిజమే | Shraddha Srinath to star in Ajith’s Pink remake | Sakshi
Sakshi News home page

ఆ వార్తలు నిజమే

Jan 29 2019 3:58 AM | Updated on Jan 29 2019 3:58 AM

Shraddha Srinath to star in Ajith’s Pink remake - Sakshi

శ్రద్ధా శ్రీనాథ్‌

‘‘అజిత్‌ కొత్త సినిమాలో నేను హీరోయిన్‌గా చేస్తున్నట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం అని చెప్పడానికి సంతోషిస్తున్నా’’ అని హీరోయిన్‌ శ్రద్ధా శ్రీనాథ్‌ అన్నారు. బాలీవుడ్‌ హిట్‌ చిత్రం ‘పింక్‌’ తమిళంలో అజిత్‌ హీరోగా రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్టు పేర్కొన్నారు శ్రద్ధా. ‘‘ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం కోసం ఇన్ని రోజులు మౌనంగా ఉండటం కష్టంగా అనిపించింది. అజిత్‌ సార్‌తో నటించడం సంతోషంగా ఉంది. నా కెరీర్‌లో చాలెంజింగ్‌ రోల్‌ ఇది. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో బోనీ కపూర్‌గారు నిర్మిస్తారు. ప్రస్తుత సమాజానికి చెప్పాల్సిన కథ ఇది. హిందీలో తాప్సీ పోషించిన పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు శ్రద్ధా. ఈ చిత్రం మే 1న రిలీజ్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement