‘జెర్సీ’లో ‘యూటర్న్‌’ భామ..!

Shraddha Srinath To Romance Nani In Jersey - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కనున్న తాజా చిత్రం జెర్సీ. ఇటీవల దేవదాసు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాని ప్రస్తుతం హాలీడేస్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు. షార్ట్‌ గ్యాప్‌ తరువాత జెర్సీ సినిమా షూటింగ్‌కు హాజరు కానున్నాడు. ఈ సినిమా క్రికెట్‌ నేపథ్యంలో పీరియాడిక్‌ డ్రామా తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది.

మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌ను ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది. కన్నడలో యూటర్న్‌ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న శ్రద్ధా శ్రీనాథ్‌.. జెర్సీలో నానికి జోడిగా నటించనున్నారు. ఈ సినిమాలో మలయాళ నటి రెబ్బా మోనికా జాన్‌ మరో హీరోయిన్‌గా నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ ‍బ్యానర్‌ పై తెరకెక్కుతున్నన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top