నంబర్‌ 3 | Shraddha Das opposite Jeet in 'Panther | Sakshi
Sakshi News home page

నంబర్‌ 3

Apr 20 2019 2:38 AM | Updated on Apr 20 2019 2:38 AM

Shraddha Das opposite Jeet in 'Panther - Sakshi

శ్రద్ధాదాస్‌

మళ్లీ బెంగాలీ డైలాగ్‌ పేపర్స్‌ పట్టుకున్నారు కథానాయిక శ్రద్ధాదాస్‌. ‘ది రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ (2014), బాద్షా : ది డాన్‌ (2016)’ శ్రద్ధాదాస్‌ ఇంతకుముందు నటించిన బెంగాలీ చిత్రాలు. ‘‘టాలీవుడ్‌ (బెంగాలీ ఫిల్మ్‌ ఇండస్ట్రీని కూడా టాలీవుడ్‌ అని పిలుస్తారు) బాద్షా జీత్‌ హీరోగా నటించనున్న సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్నందుకు హ్యాపీగా ఉంది. గౌరవంగా ఫీల్‌ అవుతున్నాను’’ అని పేర్కొన్నారు శ్రద్ధా. ఇలా బెంగాలీలో మూడో సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు శ్రద్ధా.

ఈ సినిమాకు అన్షుమాన్‌ ప్రత్యూష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‌ కోల్‌కతాలో ప్రారంభం అయ్యింది. రెండేళ్ల క్రితం ‘బాద్షా: ది డాన్‌’ చిత్రంలో స్క్రీన్‌ను షేర్‌ చేసుకున్నారు శ్రద్ధా అండ్‌ జీత్‌. మరి బెంగాలీ సినిమా తప్ప శ్రద్ధా చేతిలో సినిమాలు లేవా? అంటే అదేం లేదు. తమిళ, తెలుగు, కన్నడ సినిమాలు చేస్తున్నారు. అలాగే ఇటీవలే ‘సోల్‌’ ఇంగ్లీష్‌ షార్ట్‌ ఫిల్మ్‌తో డిజిటల్‌ రంగం వైపు కూడా అడుగు వేశారు శ్రద్ధా. ఇక ముంబైలో పుట్టినప్పటికీని శ్రద్ధాదాస్‌ తల్లిదండ్రులు బెంగాల్‌కి చెందినవారన్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement