అలాంటప్పుడు ఆ యాడ్‌ ఎందుకు చేశావ్‌? | Shradda Kapoor Trolled after Post Marilyn Monroe Pic | Sakshi
Sakshi News home page

Dec 3 2017 12:31 PM | Updated on Apr 3 2019 5:44 PM

Shradda Kapoor Trolled after Post Marilyn Monroe Pic - Sakshi

సాక్షి, సినిమా : నటి శ్రద్ధాకపూర్‌ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ ఎదుర్కుంటున్నారు. బాడీ షేమింగ్‌కు వ్యతిరేకంగా ఆమె పోస్టు చేసిన ఓ పోస్ట్‌ తో ఇబ్బంది ఎదుర్కుంటున్నారు. 

నటి విద్యాబాలన్‌, పరిణితీ చోప్రాలు బాడీ షేమింగ్‌ విమర్శలు ఎదుర్కున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి మద్దతు చెబుతూ శ్రద్ధా, మార్లిన్‌ మన్రో ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. మన్రో... శరీర సౌష్టవం పర్‌ఫెక్ట్‌గా లేకపోయినా సెక్సీ ఐకాన్‌గా, అందమైన మహిళగా ఆమె నిలిచారు. ఎవరి దేహం వారి ఇష్టం అన్న అర్థం వచ్చేలా సందేశం ఉంచారు.   

అయితే కొందరు దీనిని అభినందించినప్పటికీ.. చాలా మంది మాత్రం వ్యతిరేకించారు. శ్రద్ధాకపూర్‌ ఓ ప్రముఖ గ్రీన్‌ టీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఎవరి ఇష్టం వారిదన్నప్పుడు.. యాడ్లు చేయటం, ఎక్సర్‌సైజులు చెయ్యండంటూ సలహాలు ఇవ్వటం ఎందుకు?  డబ్బు కోసమే కదా! అని ఈ బ్యూటీని ప్రశ్నిస్తున్నారు. అయితే వాటిని శ్రద్ధ మాత్రం చాలా లైట్‌గా తీస్కుంది. 

ఆ సగంతి పక్కనపెడితే ప్రభాస్‌ సాహోతోపాటు సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో శ్రద్ధాకపూర్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement