రెండు రాష్ట్రాల ప్రేమ మొదలు | Shivani Rajashekar at 2 States Movie Launch | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాల ప్రేమ మొదలు

Mar 25 2018 12:35 AM | Updated on Jul 14 2019 4:31 PM

Shivani Rajashekar at 2 States Movie Launch - Sakshi

శివాని, అడివి శేష్, రాజమౌళి

హిందీ హిట్‌ మూవీ‘2 స్టేట్స్‌’ తెలుగు రీమేక్‌ మొదలైంది.‘2 స్టేట్స్‌’ పేరుతోనే రూపొందుతోన్న ఈ చిత్రం ద్వారా జీవితారాజశేఖర్‌ల తనయ శివానీ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. వెంకట్‌రెడ్డి కుంచం దర్శకత్వంలో లక్ష్య ప్రొడక్షన్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నటుడు కృష్ణంరాజు కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి క్లాప్‌ ఇచ్చారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘అడివి శేష్‌ మంచి నటుడు.

శివానీని హీరోయిన్‌గా పరిచయం చేయడం హ్యాపీగా ఉంది. అనూప్‌ ఇప్పటికే మూడు బ్యూటిఫుల్‌ ట్యూన్స్‌ అందించారు’’ అన్నారు వెంకట్‌ కుంచం. ‘‘తెలుగులో బెస్ట్‌ మూవీస్‌లో ఒకటిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత ఎం.ఎల్‌.వి. సత్యనారాయణ (సత్తిబాబు). ‘‘నేను నటించడానికి అంగీకరించిన నా తల్లిదండ్రులకు థ్యాంక్స్‌’’ అన్నారు శివానీ రాజశేఖర్‌. ‘‘ఎప్పటి నుంచో మంచి లవ్‌స్టోరీలో నటించాలనుకుంటుంటే ఈ సినిమాతో కుదిరింది’’ అన్నారు అడివి శేష్‌. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్‌ కూఛిబొట్ల, సమర్పణ: విశ్వప్రసాద్‌.

Advertisement
 
Advertisement
Advertisement